తిరుమల లో వెంకటేశ్వరుడి పాల్వేటి ఉత్సవం ఈసారి ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీవారు వన విహారానికి వెళతారు. కానీ ఈసారి మాత్రం ఆలయంలోనే స్వామి విహారం పూర్తీ అయింది.
హైదరాబాద్ అంబర్ పేటలో దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి జరిగిన రావణ దహనం వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు.
ప్రతి ఏటా వేలాది మంది భక్తుల మధ్య కోలాహలంగా సాగే విజయవాడ అమ్మవారి తెప్పోత్సవం ఈసారి రద్దు చేశారు. కృష్ణానది ఒడ్డునే తెప్పోత్సవానికి ఉపయోగించే పడవలో అమ్మవారికి పూజాదికాలు నిర్వహించారు.
బతుకమ్మ సంబరాల్లో భాగంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన పెద్ద బతుకమ్మ
తెలంగాణా గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
వరంగల్ లోని పద్మాక్షినగర్ లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు