Curd : పెరుగులో ఉప్పు బెటరా.. చక్కెర మంచిదా ? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
జీర్ణక్రియకు ఉప్పు పెరుగు:
పెరుగులో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ అద్భుతంగా మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
సులభంగా అరుగుతుంది:
కొందరికి సాదా పెరుగు కంటే ఉప్పు కలిపిన పెరుగు చాలా వేగంగా, సులభంగా జీర్ణమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బీపీ ఉన్నవారు జాగ్రత్త:
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉప్పు వేసుకుని తినే ముందు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎక్కువ ఉప్పు ఆరోగ్యానికి హానికరం.
తక్షణ శక్తికి చక్కెర పెరుగు:
పెరుగు, చక్కెర కాంబినేషన్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది పెరుగులోని పులుపును తగ్గించి రుచిని పెంచుతుంది.
బాడీ కూలెంట్:
వేసవి కాలంలో పెరుగులో చక్కెర కలుపుకుని తినడం వల్ల శరీరానికి మంచి చల్లదనం లభిస్తుంది. ఇది ఎండ వేడిమి నుండి ఉపశమనం ఇస్తుంది.
షుగర్ పేషెంట్లకు నో:
మధుమేహం, ఊబకాయం ఉన్నవారు పెరుగులో చక్కెరను పూర్తిగా దూరం పెట్టాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి.
చక్కెరకు బదులు ఇవి వాడండి:
సాధారణ తెల్ల చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం పెరుగులో చక్కెర బదులు పటిక బెల్లం లేదా సహజ సిద్ధమైన తేనె, బెల్లం వాడటం అమృతంలా పనిచేస్తుంది.
మితంగానే తీసుకోవాలి:
పెరుగులో ఉప్పు వేసినా, చక్కెర వేసినా సరే.. దేనినైనా సరే చాలా మితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
శరీర తత్వాన్ని బట్టి మార్పు:
ఆయుర్వేదం ప్రకారం.. ఒక వ్యక్తి శరీర తత్వం (వాత, పిత్త, కఫ ప్రకృతి), ప్రస్తుత రుతువు, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి పెరుగును ఎలా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.
పోషక విలువలు పెంచే చిట్కా:
పెరుగును మరింత హెల్తీగా మార్చడానికి అందులో తాజా పండ్ల ముక్కలు, పుదీనా, దోసకాయ తురుము లేదా వేయించిన జీలకర్ర పొడిని జోడించవచ్చు. ఇది రుచితో పాటు పోషకాలను డబుల్ చేస్తుంది.