ఈ విష‌యం తెలిస్తే.. ఇక బంగారం కొన‌డం మానేసి, ఇదే కొంటారు
బంగారం, వెండితో పోటీ పడుతున్న రాగి
రాగి ధరలు ప్రపంచ మార్కెట్లలో వేగంగా పెరుగుతున్నాయి. విద్యుత్, నిర్మాణం, ఈవీ రంగాల్లో డిమాండ్‌తో రాగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
టన్నుకు 14 వేల డాలర్లకు పైగా ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో రాగి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో రాగి టన్ను ధర 14,737 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.14 లక్షలు.
ఈ ఏడాది ఇప్పటికే 16 శాతం పెరుగుదల
ఈ ఏడాది ప్రారంభం నుంచి రాగి ధరలు సుమారు 16 శాతం పెరిగి, గత సోమవారం కొత్త గరిష్ఠాన్ని తాకాయి. ఈ పెరుగుదల అంచనాలను మించి నమోదైంది
అమెరికా సుంకాల భయంతో ముందస్తు కొనుగోళ్లు
అమెరికా వాణిజ్య విధానాలు రాగి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై ట్రంప్ సుంకాలు పెంచవచ్చనే ఆందోళనతో రాగి దిగుమతి పెరిగింది.
సరఫరా తగ్గడం మరో కారణం
రాగి వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా, గనుల నుంచి తగినంత లోహం అందుబాటులో లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.
చిలీ రాగి ఉత్పత్తిపై ఆందోళనలు
ప్రపంచంలోని కీలక రాగి ఉత్పత్తిదారుల్లో చిలీ ఒకటి. అక్కడి సరఫరా మార్పులు అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
ఏఐ డేటా సెంటర్లతో పెరుగుతున్న డిమాండ్
ఏఐ విస్తరణతో డేటా సెంటర్లలో విద్యుత్ సరఫరా, కేబులింగ్, నెట్‌వర్క్ పరికరాల అవసరం పెర‌గ‌డంతో రాగికి డిమాండ్ పెరుగుతోంది.
విద్యుత్, బ్యాటరీ రంగాల్లోనూ కీలక పాత్ర
సౌర, పవన విద్యుత్, విద్యుత్ గ్రిడ్లు, బ్యాటరీ నిల్వ, ఈవీలతో రాగి అవసరాలు పెరుగుతున్నాయి. స్వ‌చ్ఛ ఇంధ‌నంపై అవగాహ‌న పెరుగుతుండడంతో రాగికి డిమాండ్ పెరుగుతోంది.
భారీగా పెరిగిన షేరు ధ‌ర‌
రాగి కంపెనీల షేర్లపై ఆసక్తి పెరిగింది. మంగళవారం మార్కెట్ బలహీనంగా ఉన్నా హిందుస్థాన్ కాపర్ షేరు దాదాపు 5% లాభపడడం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
వేదాంత, హిండాల్కో షేర్లు కూడా
హిందుస్థాన్ కాపర్‌తో పాటు వేదాంత, హిండాల్కో షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. అయితే ఈ పెరుగుద‌ల ఇలాగే కొన‌సాగుతుందా అంటే క‌చ్చితంగా అవున‌ని స‌మాధానం చెప్ప‌లేమ‌ని నిపుణులు అంటున్నారు.