ప్రపంచంలో ఉన్న రంగురంగుల జంతువులు ఇవే

ఈ గ్రహం మీద ఐదు అత్యంత కలర్ ఫుల్ జంతువులు ఏవో చూద్దాం.
పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే మాండరిన్ ఫిష్, గోధుమ, నారింజ, ఆకుపచ్చ, నీలం రంగు చారలతో ఉంటుంది
నెమలి ఇరిడెసెంట్ తోకకు ప్రసిద్ధి చెందింది. అద్బుతమైన రంగులతో ఆకట్టుకుంటుంది.
స్కార్లెట్ మాకా ప్రపంచంలోని అత్యంత రంగుల పక్షుల్లో ఒకటి. ఎరుపు, పసుపు, నీలం ఈకలను కలిగి ఉంటుంది.
మాండరిన్ బాతులు నారింజ, ఆకుపచ్చ, నీలం, తెలుపు ఈకలతో అద్భుతంగా ఉంటుంది.
రెయిన్ బో లోరికీట్ చిలుక ఎరుపు, నారింజ, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులో అందంగా ఉంటుంది.