మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 న విడుదలైంది. అంటే సరిగ్గా 42 ఏళ్లు. అక్కడనుంచి 1983 లో వచ్చిన అభిలాష వరకూ మెల్లగా సాగింది ఆయన ప్రయాణం!
1983 లో విడుదలైన ఖైదీ సినిమా అప్పటివరకూ ఉన్న టాలీవుడ్ చరిత్రను మార్చేసింది. చిరంజీవిని స్టార్ ని చేసేసింది.
1985 లో విడుదలైన విజేత సినిమా.. అప్పటివరకూ ఉన్న చిరంజీవి ఇమేజిని మార్చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసి.. టాలీవుడ్ విజేతగా నిలిపింది
మామూలుగానే డాన్సులకు పెట్టింది పేరు చిరు. కానీ..1987లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా తెలుగు సినిమాల్లో డాన్స్ అంటేనే చిరంజీవి అన్నట్టుగా మార్చేసింది.
చిరంజీవి అంటే ఉన్న మాస్ ఇమేజి నుంచి ఆయనలోని నటుడ్ని పూర్తి స్థాయిలో పరిచయం చేశారు కళాతపస్వి కె.విశ్వనాద్ స్వయంకృషి తో 1987 లో
యముడికి మొగుడు గా 1988లో చిరంజీవి మరో చరిత్ర సృష్టించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సూపర్ హిట్టే!
జగదేకవీరుడు అతిలోక సుందరి.. శ్రీదేవితో కలిసి 1990 లో చిరంజీవి చేసిన మ్యాజిక్ ! వసూళ్ళలో అప్పటివరకూ తెలుగు సినిమాలో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టిన సినిమా!
1991 లో గ్యాంగ్ లీడర్ గా రికార్డులను రాఫ్ఫాడించేశారు చిరంజీవి.
2002 లో ఇంద్ర గా మళ్ళీ తెలుగు సినిమా చరిత్రనే మలుపు తిప్పారు మెగాస్టార్. ఇప్పటికీ ఇందులోని వీణ పాట గురించి అందరూ చెప్పుకుంటూనే ఉంటారు.
2003 లో చిరంజీవి ఠాగూర్ గా పలకరించారు.
శంకర్ దాదా ఎంబీబీఎస్ చిరంజీవిలో మరో కోణాన్ని చూపించింది.
''రాననుకున్నారా..రాలేననుకున్నారా'' అంటూ లాంగ్ గ్యాప్ తరువాత వచ్చి తన స్టామినా చూపించారు ఖైదీ నెం 150 గా..!