Coronavirus: పిల్లల్లో కనిపించే వైరస్ లక్షణాలు ఇవే..
మొదటి దశ కరోనాతో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ, సెకండ్ వేవ్ మాత్రం పిల్లలకు కూడా సోకుతోంది. మరి పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం.
లక్షణాలు..
పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రుచి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పి, స్నాయువులో నొప్పి లాంటివి కనిపిస్తాయి.
లక్షణాలు..
ముక్కు నుంచి విపరీతంగా నీరు కారడం.. క్రమేణా అది చిక్కని శ్లేష్మంగా మారడం, కొద్ది మంది పిల్లల్లో జీర్ణశయాంతర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.
లక్షణాలు..
వీటితో పాటు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని గుర్తించాలి. పిల్లలు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నా నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.
చికిత్స
సాధారణంగా పిల్లలు కరోనా బారిన పడితే త్వరగానే కోలుకుంటారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. లక్షణాలు కనిపంచని పిల్లలను ఇంట్లోనే చికిత్స అందివ్వాలని.. హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
హాస్పిటల్కి ఎప్పడు వెళ్లాలి
విపరీతంగా గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా, ఆయసం, ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నాతక్కువగా పడిపోయినా, ఒకటే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
మరికొన్ని లక్షణాలు
కరోనా సెకండ్ వేవ్ల్లో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోవడం, చిరాకు పడటం, ఆపకుండా ఏడ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంట.