Calcium Foods: పాలు తాగకున్నా సరే వీటిని డైట్లో చేర్చుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి

మనలో చాలా మంది పాలు తాగడం ఇష్టం ఉండదు. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కానీ పాల కంటే ఎక్కువ కాల్షియం అందించే పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా?
పాలు తాగమని మారం చేసే చిన్న పిల్లలకు పాలకు బదులుగా ఈ పదార్థాలను డైట్లో చేర్చితే కాల్షియం పుష్కలంగా అందుతుంది.
బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో చాలా మొత్తంలో కాల్షియం ఉంటుంది. చియా సీడ్స్ ను పెరుగు లేదా స్మూతీస్ చేర్చుకోవచ్చు.
టోఫు, సోయాబీన్స్ నుంచి తయారువుతుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని పలు రకాల వంటకాల్లో ఉపయోగించవచ్చు.
బాదం కాల్షియానికి గొప్ప మూలం. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్స్ ఉంటాయి. వీటిని రోజూవారీ డైట్లో చేర్చుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
బ్రోకలీ కాల్షియం యొక్క మంచి మూలం. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలతోపాటు ఇందులో ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది.
వైట్ బీన్స్ లో కూడా కాల్షియం ఉంటుంది. ఇందులో ప్రొటీన్స్, ఫైబర్ వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి.
బెండకాయలోనూ కాల్షియం లభిస్తుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం బలమైన ఎముకలకు దోహదం చేస్తుంది. బెండకాయతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వంద గ్రాముల బెండకాయలో 80 గ్రాముల కాల్షియం ఉంటుంది.