మజ్జిగ
చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦.మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగతొ శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.
పొడి చర్మం: మజ్జిగలో కొంచెం నిమ్మరసం కలిపి రాసుకొని సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం నునుపుగా తయారవుతుంది.
ఒంటికణత నొప్పికి అన్నంలో మజ్జిగ పోసుకొని కొంచెం బెల్లం కలిపి తినాలి. దీనిని సూర్యోదయానికి ముందే తీసుకోవాలి.
విరేచనాలు: మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడిని కలిపి తీసుకోవాలి. లేదా మజ్జిగలో తేనె కలిపి తీసుకోవాలి.