జీర్ణక్రియకు దివ్యౌషధం :

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలను తొలగించి, ఆహారం సులభంగా అరగడానికి సహాయపడతాయి.
అసిడిటీ, గ్యాస్ నుంచి తక్షణ ఉపశమనం :
కడుపులో మంటగా ఉన్నా లేదా గ్యాస్ ఇబ్బంది పెడుతున్నా.. ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలు! ఇది కడుపు లోపల చల్లదనాన్ని ఇచ్చి ఆమ్ల ప్రభావాలను తగ్గిస్తుంది.
సహజమైన కూలర్ :
ఎండలో తిరిగే వారికి డీహైడ్రేషన్ పెద్ద సమస్య. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
ఎముకలు, దంతాల బలానికి :
మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ మజ్జిగ తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి. వయసు మళ్లిన వారికి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ చాయిస్ :
ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. పోషకాలు మాత్రం ఎక్కువ. ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
బీపీ కంట్రోల్.. గుండెకు సేఫ్ :
మజ్జిగలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మ సౌందర్యానికి మెరుగులు :
మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మొటిమలను నివారించి, చర్మానికి సహజమైన కాంతిని, మృదుత్వాన్ని ఇస్తుంది.