జుట్టు పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

మీ డైట్లో ఈ ఫుడ్స్ తీసుకుంటే..మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆ ఫుడ్స్ ఏంటో చూద్దామా.
కొవ్వు చేప
ఒమేగా -3కొవ్వు ఆమ్లాలు ఉండే సాల్మన్, మాకేరెల్, సార్డినెల్ వంటి చేపలను మీ డైట్లో చేర్చుకుంటే జుట్టు పెరుగుతుంది.
గుడ్లు
గుడ్లలో ప్రొటీన్, బయోటిన్ ఉంటుంది. ఈ రెండూ జుట్టు ఆరోగ్యానికి అవసరం. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
పాలకూర
ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
గింజలు, విత్తనాలు
బాదం, వాల్నట్స్, అవిసెగింజలు, చియాసీడ్స్ లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్ ఇ అధిక మోతాదులో ఉంటాయి.
గ్రీన్ పెరుగు
గ్రీన్ పెరుగులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే డైట్లో గ్రీక్ పెరుగును చేర్చుకోవాలి.
బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా కాపాడుతాయి.
చిలకగడదుంపలు
బీటాకెరోటిన్ ఎక్కువగా ఉండే చిలకడదుంపలను డైట్లో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ సెబమ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
లీన్ మీట్స్
డైట్లో చికెల్ లేదా టర్కీ వంటి లీన్ మాంసం చేర్చుకుంటే ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా అందుతుంది.
అవకాడో
అవకాడలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇ, సి, బయోటిన్ ఉంటుంది. జుట్టుకు బలాన్ని అందిస్తాయి.