మీ బ్రెయిన్ కంప్యూటర్ కంటే షార్ప్‎గా ఉండాలా? ఈ ఫుడ్స్ తినాల్సిందే

మీ జ్ఞాపకశక్తికి పదునుపెట్టి మీ బ్రెయిన్ కంప్యూటర్ కంటే ఫాస్టుగా పనిచేసేలా సహాయపడే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.
సుగంధ ద్రవ్యాలు
సుగంధ ద్రవ్యాలలో యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. పసుపు వంటి వాటిలో యాంగ్జైటీని తగ్గించే లక్షణాలు ఉంటాయి.
పులియనబెట్టిన ఆహారాలు
పులియబెట్టిన ఆహారాలు చాలా రకాలు ఉంటాయి. పెరుగులో ఈస్ట్ ఉంటుంది. పెరుగుతోపాటు సార్ క్రట్, కిమ్చీ, కొంబుచా వంటివి ఇందులోకి వస్తాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వాల్ నట్స్
వాల్ నట్స్ చూడటానికి మానవ బ్రెయిన్ వలే ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
డార్క్ చాక్లెట్
చాక్లెట్ ఇష్టపడేవారు డార్క్ చాక్లెట్ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
అవకాడో
అవకాడో మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యమైంది. ఇందులో మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది. డిప్రెషన్ తో బాధపడేవారు అవకాడోను డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.
ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వీటితోపాటు ఒత్తిడి, ఆందోళన లేని జీవనశైలిని అనుసరిస్తే మెదడు షార్ప్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.