శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి సూర్యరశ్మి అంతే అవసరం. ఆహారం నుంచి శక్తిని పొందితే, సూర్యకాంతి నుంచి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.
సూర్యకాంతి ఎముకల పెరుగుదల ఇంకా బలానికి అవసరమవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
వాస్తవానికి మన శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకలకు చాలాముఖ్యమైనది. ఎందుకంటే ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.
సూర్యకాంతిలో ఉండటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఈ హార్మోన్లు శరీరం, మనస్సును రిలాక్స్ చేస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.