ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎందుకంటే పెరుగులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటినీ పెరిగేందుకు సహాయపడుతుంది.
జీర్ణక్రియకు మంచిది
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగులో విటమిన్ బి 12 లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బరువు తగ్గడంలో
మీరు బరువు తగ్గాలని కోరుకుంటే తప్పకుండా ఉదయాన్నే బరువు తినడం మంచిది. ఖాళీ కడుపుతో పెరుగు తింటే బరువు తగ్గుతారు. శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
ఎముకలు బలంగా
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తింటే ఎముకలు బలంగా ఉంటాయి. దీంతో శరీరానికి కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్లు అధికమోతాదులో అందుతాయి. ఈ పోషకాలు ఎముకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఆస్టియోపోరోసిస్ నివారణ
పెరుగులో విటమిన్ డి, కాల్షియం,అధికమోతాదులో ఉంటాయి. మీ ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా మీ కండరాలను బలంగా ఉంచుతాయి. పెరుగు రోజూ తింటే ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
పెరుగులోని పోషకాలు
పెరుగులోని పోషకాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మీ బీపీ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
పెరుగు వల్ల లాభాలు
ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తింటే జీవక్రియ సరిగ్గా జరుగుతుంది.