బెల్లీ ఫ్యాట్ తగ్గించే మార్నింగ్ డ్రింక్స్ ఇవే

వేడి నీళ్లు నిమ్మకాయ
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి మార్నింగ్ తాగాలి. ఈ నీరు జీవక్రియను పెంచుతుంది.ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీ బ్యాగ్ ను వేడి నీటిలో 3 నుంచి 5 నిమిషాలు ఉంచండి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు , కాటెచిన్లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. కొవ్వును బర్న్ చేస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఒక గ్లాసు నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపండి. యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ లో షుగర్ లెవల్స్ తగ్గించడానికి జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
దోసకాయ, పుదీనా నీరు
ఒక గ్లాసు నీటిలో దోసకాయ ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు వేయాలి. దీన్ని రిఫ్రిజిరేటర్ లో రాత్రంతా పెట్టాలి. ఉదయం తాగాలి. దోసకాయలో హైడ్రేటింగ్, కేలరీలు తక్కువగా ఉంటాయి.
పసుపు టీ
ఒక టీ స్పూన్ పసుపు పొడిని తీసుకుని వేడి నీళ్లలో కలపండి. రుచి కోసం చిటికెడు నల్ల మిరియాలు, తేనె వేయాలి. పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియను పెంచుతాయి.
దాల్చిన చెక్క, తేనె నీరు
అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో కరిగించి, ఒక టీస్పూన్ తేనె కలపండి. దాల్చిన చెక్క రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అలోవెరా జ్యూస్
ఒక గ్లాసు నీటిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లేదా జ్యూస్ కలపండి. అలోవెరా జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది.