ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి.
అందువల్ల వచ్చే నెలలో బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందుగానే చేసుకోండి.
లేదంటే సెలవుల జాబితాని ఒకసారి చెక్‌ చేయండి.
ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 2, 9,16,23,30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 4న వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 5 బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 8 రెండో శనివారం, 22 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 15న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు జరుపుకుంటారు. కాబట్టి..ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
షాబ్ ఇ బకర్ కారణంగా ఏప్రిల్ 18న జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఈద్ ఉల్ ఫితర్‌తో ఏప్రిల్ 21న అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.