Arouca: అరౌకా.. ప్రపంచంలోని అతి పొడవైన వేలాడే బ్రిడ్జి
ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే బ్రిడ్జిని పోర్చుగల్ ప్రభుత్వం అధికారికంగా ఇటీవలే ప్రారంభించింది. దీనిని‘బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్’ లేదా ‘అరౌకా 516’గా పిలుస్తారు.
ఉత్తర పోర్చుగల్‌లోని ‘అరౌకా జియోపార్క్’ పావియ నదిపై 175 మీటర్ల ఎత్తు (574 అడుగులు) లో నిర్మించారు. దీని పొడవు 516 మీటర్లు (1693 అడుగులు).
2017లో స్విట్జర్లాండ్లో ప్రారంభించిన ‘చార్లెస్ కుయోనెన్ సస్పెన్షన్’ బ్రిడ్జి 494 మీటర్ల(1621 అడుగుల) పొడవుతో ఉండేది. ప్రస్తుతం దీన్ని అరౌకా రెండో స్థానానికి నెట్టేసింది.
2018లో నిర్మాణం ప్రారంభించి 2020లో పూర్తి చేశారు. ఈ వారధికి ఇరువైపులా ‘వి’ ఆకారంలో ఉన్న రెండు టవర్లు ఉన్నాయి.
అరౌకా నిర్మాణానికి మొత్తం 2.8 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన రూపాయాల్లో అక్షరాల 20.68 కోట్లు.
నడిచేటప్పుడు కిందకు చూస్తే మాత్రం గుండె గుబేలుమంటోందని పర్యాటకులు చెబుతున్నారు.
అరౌకా బ్రిడ్జిపై నడిచిన తొలి వ్యక్తి హ్యూగో జేవియర్.
అరౌకా బ్రిడ్జిపై నడవాలంటే 12 – 14 డాలర్ల రుసుము చెల్లించాలి.