ఆర్మీ క్యాంటిన్‎లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా?

మాల్స్ లేదా డీమార్ట్ కంటే ఆర్మీ క్యాంటీన్ వస్తువులు కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దీనికి కారణం ఏంటో తెలుసా
ఏ షాపులో అయినా ఎమ్మార్పీ ధరకే మనకు వస్తువులను అమ్ముతుంటారు. కానీ ఆర్మీ క్యాంటీన్ లో మాత్రం ఎమ్మార్పీ ధర కంటే చాలా తక్కువగా ధరకు అమ్ముతారు.
కార్లు, బైకులు కూడా క్యాంటీన్ నుంచి కొనుక్కొవచ్చు. వీటితోపాటు క్యాంటీన్ లో అందుతున్న సబ్సిడీకి సంబంధించిన పలు రకాల వస్తువులను షేర్ చేస్తుంటారు. చాలా డిస్కౌంట్ కూడా ఉంటుంది.
కిరణా వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఆల్కహాల్, ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా ఆర్మీ క్యాంటీన్ లో అందుబాటులో ఉంటాయి.
వీటితోపాటు బైక్ లు, కార్లు కూడా క్యాంటీన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ లో దాదాపు 3700 ఆర్మీ క్యాంటీన్లు ఉన్నాయి.
వీటిలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా వస్తువులను అమ్ముతుంటారట. అయితే ఆర్మీ సిబ్బందికి, రిటైర్డ్ అధికారులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి.
సామాన్యులు ఆర్మీ క్యాంటీన్ ను వినియోగించుకోలేరు. సాధారణ ఆర్మీ సిబ్బందికి రెండు రకాల కార్డులను ఇస్తారు. ఒకటి కిరాణ కార్డు. మరోకారు మద్యంకు సంబంధించింది.
కిరాణ కార్డు ద్వారా గ్రాసరీ, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మద్యంకార్డుతో ఆల్కహాల్ కొంటారు. ఈ కార్డు సామాన్యులకు అందుబాటులో ఉండదు. సైన్యంలో ఉన్నవారికే ఈ కార్డు ఉంటుంది.
ధర అనేది ఏ వస్తువులపై ఎంత రాయితీ లభిస్తుందో ట్యాక్స్ ఆధారంగా నిర్ణయిస్తారు.
ఆర్మీ క్యాంటీన్ లో ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 50శాతం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. జీఎస్టీలో ప్రభుత్వం 50శాతం మినహాయింపు ఇస్తుంది.