ఒక కాటన్ బాల్‌లో ఒకటి లేదా రెండు చుక్కల లవంగం నూనె తీసుకొని నొప్పి ఉన్న దగ్గర అప్లై చేయాలి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకులు యాంటీమైక్రోబయల్ గుణాలతో నిండి ఉంటాయి. ఇవి క్యావిటీలను నివారించడంలో మేలు చేస్తాయి. జామ ఆకులను ఉడకబెట్టి మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత కొంత సమయానికి నిమ్మరసాన్ని నొప్పి ఉన్న దగ్గర అప్లై చేయాలి.
నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు ఒక వెల్లుల్లి ముక్కను పరగడుపున తీసుకోవాలి. దీనివల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.