హ్యాంగింగ్ సమస్యలకు చెక్:

ఫోన్ స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం లేదా క్యాష్ డేటా పెరిగిపోయినప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ బెస్ట్ సొల్యూషన్.
డేటా ప్రైవసీ:
పాత ఫోన్‌ను ఇతరులకు అమ్మేముందు మీ పర్సనల్ డేటా డిలీట్ చేయడానికి రీసెట్ చేయడం తప్పనిసరి.
డేటా బాకప్:
రీసెట్ చేయడానికి ముందే కాంటాక్ట్స్, ఫోటోలు, ఫైళ్లను గూగుల్ డ్రైవ్‌లో ఖచ్చితంగా బాకప్ చేసుకోవాలి.
సెట్టింగ్స్ రీసెట్:
ఫోన్ ఆన్‌లో ఉంటే సెట్టింగ్స్ మెనూ ద్వారా అత్యంత సులభంగా రీసెట్ చేయవచ్చు.
సెట్టింగ్స్ ప్రాసెస్:
Settings > System settings > Reset options > Erase all data ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
సెక్యూరిటీ పిన్:
రీసెట్ ప్రాసెస్ పూర్తయ్యే ముందు మీ ఫోన్ పాస్‌వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
రికవరీ మోడ్:
ఫోన్ ఆన్ కానప్పుడు డివైజ్ ఆన్ చేయకుండానే రికవరీ మోడ్ ద్వారా రీసెట్ చేయవచ్చు.
బటన్ కాంబినేషన్:
ఫోన్ ఆఫ్ చేసి, పవర్ , వాల్యూమ్ డౌన్ బటన్లను నొక్కి పట్టుకుంటే రికవరీ మోడ్ వస్తుంది.
వైప్ డేటా:
రికవరీ మెనూలో Wipe data / Factory reset ఎంచుకుని పవర్ బటన్‌తో కన్ఫర్మ్ చేయాలి.
పూర్తిగా క్లీన్:
రీసెట్ తర్వాత ఫోన్‌లోని యాప్‌లు, ఫోటోలు, మెసేజ్‌లు అన్నీ తొలగిపోయి ఫోన్ కొత్తదానిలా మారుతుంది.