జుట్టు ఊడటం బంద్:

కరివేపాకులోని ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ బి12 జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని అరికడతాయి.
రక్తహీనత నివారణ:
ఇందులో ఉండే పుష్కలమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి అనీమియా నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఎముకల బలోపేతం:
కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు దృఢపడతాయి. కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గుతాయి.
కిడ్నీల శుద్ధి :
రోజూ ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నమలడం వల్ల మూత్రపిండాల్లోని వ్యర్థాలు తొలగిపోతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
విటమిన్ సి, పోషకాలు సమృద్ధిగా లభించి శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను శక్తివంతంగా మారుస్తాయి.
గుండె ఆరోగ్యం:
చెడు కొలెస్ట్రాల్‌ (LDL)ను కరిగించి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడం ద్వారా గుండెను కాపాడుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల:
అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు త్వరితగతిన నివారించబడతాయి.
బరువు తగ్గడంలో సహాయం:
కరివేపాకులోని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
చర్మ సంరక్షణ:
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.
పిల్లల్లో ఆకలి పెంపు:
పిల్లలలో ఆకలి మందగించినప్పుడు అన్నంలో కరివేపాకు పొడి, నెయ్యి కలిపి తినిపిస్తే ఆకలి వేగంగా పెరుగుతుంది.