అక్షయ తృతీయ సంప్రదాయ పండుగ. ఈ రోజు బంగారం, వెండి కొనడం మంచిదని నమ్ముతుంటారు.
అక్షయ అంటే శాశ్వతమైనది. కాబట్టి, బంగారం కొనడం ద్వారా బాగా అభివృద్ధి చెందుతారని భావిస్తారు. ఈరోజు కొన్న బంగారం నశించిపోదని నమ్ముతారు. బాగా వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు.
అక్షయ తృతీయ 2021 లో మే 14, శుక్రవారం నాడు వచ్చింది. ప్రజలు బంగారం కొనేందుకు ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు.
అక్షయ తృతీయ ముందురోజు గురువారం బంగారు రేట్లు తగ్గాయి. అలాగే శుక్రవారం మరింత తగ్గుతాయని ప్రజలు ఆశిస్తారు. బంగారమే కాక కార్లు లేదా ఖరీదైన గృహ ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు చూస్తారు.
విష్ణు దేవుడికి ఈ రోజు పూజలు చేస్తారు. ఇలా చేస్తే మిగిలిన ఏడాదంతా మంచితో పాటు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.