30ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మహిళలు 30ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విటమిన్లు చాలా అవసరం. అవేంటో చూద్దాం.
30ఏళ్ల తర్వాత కండరాల తిమ్మిరి, అలసట, ఆధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇవి మెగ్నీషియం లోపం వల్ల సంభవిస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే పాలకూర, త్రుణధాన్యాలు, డ్రైఫ్రూట్స్, నట్స్, చేపలు తినాలి.
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మీ ఆహారంలో పాలు, పెరుగు, కివి మఖానా, పప్పులు, కిడ్నీ బీన్స్ మొదలైనవి చేర్చుకోవాలి.
ఐరన్ లోపం చాలా ప్రమాదకరం. మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ వస్తుంది. ఈ కారణంగా వారు నీరసంగా మారుతారు. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు బచ్చలికూర, బీట్ రూట్, శనగలు బెల్లం, దానిమ్మ మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
శరీరం అన్ని విధాలుగా మెరుగ్గా పనిచేయడానికి విటమిన్ డి చాలా అవసరం. దాన్ని లోపాన్ని అధిగమించేందుకు ప్రతిరోజూ సూర్యరశ్మిని తీసుకోవాలి. మీ ఆహారంలో పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు, మెంతులు, అత్తిపండ్లను చేర్చుకోవాలి.
విటమిన్ బి6 30ఏండ్ల తర్వాత చాలా ముఖ్యం. గర్బం దాల్చినప్పటి నుంచి సాధారణ ప్రసవం వరకు స్త్రీలకు ఇది చాలా అవసరం. దీని లోపం గుండె ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి.
విటమిన్ బి 12 నరాల పనితీరు, ఆర్ బీసీ ఉత్పత్తికి చాలా ముఖ్యం. దీని లోపం వల్ల అలసట, జ్నాపకశక్తి కోల్పోవడం, రక్తహీనత మొదలైన సమస్యలు వస్తాయి. రెడ్ మీట్, పుట్టగొడుగులు, గుడ్లు, బలవర్ధకమైన ఆహారాలు తీసుకోవాలి.
ఇవే కాకుండా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే వాటిని కచ్చితంగా తినండి. దీన్ని తీసుకుంటే వయస్సు కంటే ముందు చర్మం దెబ్బతినదు. ఏదైనా లోపిస్తే సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం తర్వాతే సప్లిమెంట్స్ తీసుకోవాలి.