టాలీవుడ్లో తండ్రీకొడుకులతో నటించిన హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఈ జనరేషన్లో ఇలాంటి ఫీట్ అందుకోవడం చాలా కష్టం. అలాంటి హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం.
కాజల్ అగర్వాల్- రాంచరణ్-చిరంజీవి
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో కాజల్ 'మగధీర', 'నాయక్', 'గోవిందుడు అందరివాడేలే' సినిమాల్లో నటించింది.
కాజల్ అగర్వాల్ - రాంచరణ్ - చిరంజీవి
ఇక చిరంజీవితో 'ఖైదీ నంబర్ 150' లో నటించింది. ఈ సినిమాలో తండ్రీకొడుకులతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది.తాజాగా 'ఆచార్య' సినిమాలో మరోసారి చిరంజీవితో జోడీ కట్టింది. ఇందులో రాంచరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
కాజల్ అగర్వాల్- నాగ చైతన్య-నాగర్జున
అక్కినేని హీరో నాగచైతన్యతో 'దడ' సినిమాలో నటించింది కాజల్. తాజాగా ఆయన తండ్రి నాగార్జున సినిమాలో హీరోయిన్గా కాజల్ ఎంపికైంది.
లావణ్య త్రిపాఠి- నాగ చైతన్య - నాగర్జున
లావణ్య త్రిపాఠి నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో జత కట్టింది. అలాగే నాగచైతన్యతో 'యుద్ధం శరణం'లో హీరోయిన్గా కనిపించింది.
రకుల్ ప్రీత్ సింగ్- నాగ చైతన్య - నాగర్జున
రకుల్ ప్రీత్ సింగ్, నాగచైతన్యతో కలిసి 'రారండోయ్ వేడుక చూద్దాం'లో సందడి చేసింది. మరోవైపు నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు 2'లో హీరోయిన్గా నటించింది.
తమన్నా- చిరంజీవి - రాం చరణ్
తమన్నా 'సైరా నరసింహారెడ్డి'లో మెగాస్టార్ చిరంజీవి పక్కన మెరిసింది. ఇక చెర్రీతో 'రచ్చ' సినిమాలో రోమాన్స్ చేసింది.