ప్రాథమిక నిబంధన:

వాట్సాప్ వెబ్, మ్యాక్ లేదా విండోస్ వంటి లింక్డ్ డివైజ్‌ల నుంచి నేరుగా చాట్ బ్యాకప్ లేదా రికవరీ చేయడం సాధ్యపడదు.
ముఖ్యమైన మొబైల్ తప్పనిసరి:
చాట్స్ రికవర్ చేయాలంటే మీరు మొదట వాట్సాప్ రిజిస్టర్ చేసిన ప్రైమరీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే ఉపయోగించాలి.
గూగుల్ ఖాతా ఆక్టివ్‌గా ఉండాలి:
ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్ రికవరీ కోసం మీ గూగుల్ అకౌంట్ మరియు గూగుల్ ప్లే సర్వీసెస్ ఆక్టివ్‌గా ఉండటం అత్యవసరం.
తగినంత స్టోరేజ్ ఉందో లేదో చూసుకోండి:
చాట్ బ్యాకప్ ఫైల్ పరిమాణానికి సరిపడా ఖాళీ స్థలం మీ ఫోన్ మెమరీతో పాటు గూగుల్ డ్రైవ్‌లో కూడా ఉండాలి.
ఆండ్రాయిడ్‌లో బ్యాకప్ – స్టెప్ 1:
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి, పైన కుడివైపు ఉన్న మూడు చుక్కల మెనూపై ట్యాప్ చేయండి.
ఆండ్రాయిడ్‌లో బ్యాకప్ – స్టెప్ 2:
సెట్టింగ్స్‎లోకి వెళ్లి, చాట్స్ ఆప్షన్ ఎంచుకుని, చాట్ బ్యాకప్ పై క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్‌లో బ్యాకప్ – స్టెప్ 3:
అక్కడ ఉన్న బ్యాకప్ బటన్ నొక్కితే మీ డేటా గూగుల్ డ్రైవ్‌లో సురక్షితంగా సేవ్ అవుతుంది.
ఐఫోన్ (iOS)లో బ్యాకప్ – స్టెప్ 1:
మీ ఐఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి, హోమ్ స్క్రీన్‌పై ఉన్న మీ ప్రోఫైల్ పిక్చర్‌పై ట్యాప్ చేయండి.
ఐఫోన్ (iOS) లో బ్యాకప్ – స్టెప్ 2:
అక్కడి నుంచి చాట్స్ విభాగంలోకి వెళ్లి, చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఐఫోన్ (iOS) లో బ్యాకప్ – స్టెప్ 3:
చివరగా బ్యాకప్ నౌ పై క్లిక్ చేయగానే మీ చాట్ హిస్టరీ ఐక్లౌడ్ ‎లో భద్రమవుతుంది.