మీలో ఎంత మందికి మొక్కల వయస్సు గురించి తెలుసు. ఇంట్లో గార్డెన్ లో పెంచే మొక్కల వయస్సు గురించి ఎప్పుడైనా ఆలోచించారా. 80ఏండ్ల కంటే ఎక్కువగా జీవించే మొక్కల గురించి తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మాన్ స్టెరా
మాన్ స్టేరా మొక్క ఆకుపచ్చని ఆకులతో నిగనిగలాడుతుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మాన్ స్టెరా మొక్క 80 ఏండ్ల కంటే ఎక్కువగా జీవిస్తుంది.
మనీ ప్లాంట్
ఇది అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీనిని పోథోస్ అని పిలుస్తుంటారు. ఈ మొక్క వయస్సు 100 సంత్సరాల కంటే ఎక్కువగానే ఉంటుంది.
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్ చాలా మంది ఇళ్లలో పెంచుకుంటారు. ఇది ఇండోర్ ప్లాంట్. పొడవాటి ఆకులు ఎల్లో, గ్రీన్ కలర్ ఉంటాయి. ఈ మొక్క వయస్సు 80ఏండ్ల కంటే ఎక్కువే.
జాడే
ఈ మొక్క చూడటానికి చాలా అందంటా ఉంటుంది. ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఔట్ డోర్ లోనూ పెంచుకోవచ్చు. ఈ మొక్క వయస్సు 80ఏండ్లు.
స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ అందంగా ఉంటుంది. ఆకులు చూడగానే ఆకట్టుకుంటాయి. దీని వయస్సు 80 సంవత్సరాలు.
అలోవెరా
అలోవెరా 80ఏండ్లకు పైగా పెరుగుతూనే ఉంటుంది. ఈ మొక్క పెరిగే ప్రదేశం బాగుంటే ఏపుగా పెరుగుతుంది.
చైనీస్ ఎవర్ గ్రీన్
చైనీస్ ఎవర్ గ్రీన్ అనే మొక్క గ్రీన్, రెడ్ కలర్ లో ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. తక్కువ వెలుతురులోనూ పెరుగుతుంది.
ఫిడిల్ లీఫ్
ఈ మొక్క ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. ఇది ఇండోర్ ప్లాంట్. ఈ మొక్కను సరిగ్గా పెంచితే దశాబ్దాల పాటు జీవిస్తుంది. కుండ బదులు నేలలో పెంచితే చాలా ఎత్తుగా పెరుగుతుంది.
రబ్బరు మొక్క
రబ్బర్ ప్లాంట్ 80ఏండ్లకు పైగా జీవిస్తుంది. ఈ మొక్క ఆకులు చాలా అందంగా ఉంటాయి.