పొడవైన, ఒత్తైన జుట్టు పెరుగుదలకు అద్భుతమైన 9 సూపర్ ఫుడ్స్ ఇవే

జీవనశైలి
నేటికాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల అనారోగ్య సమస్యలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ఒత్తిడితో బీపీ, షుగర్, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
జుట్టురాలడం
జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. జుట్టు మన రూపాన్ని అందంగా, ప్రత్యేకంగా చూపిస్తుంది. జుట్టు రాలిపోతుంటే మన ఆత్మస్థైర్యం కూడా తగ్గుతుంది.
లీఫ్ క్యాబేజీ
లీఫ్ క్యాబేజీలో ఫొలేట్, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదులకు సహాయం చేస్తాయి.
పాలకూర
పాలకూరలో కేలరీలు తక్కువ, ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, కే, ఐరన్, ఫోలేట్ జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.
చిక్కుడు
చిక్కుడు కాయల్లో మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
పుదీనా
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
గ్రీన్ పెప్పర్
గ్రీన్ పెప్పర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
బ్రోకోలీ
బ్రోకోలీలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. జుట్టుకు కుదుళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
అవకాడో
అవకాడోలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుటలో సహాయపడతాయి.