రంగును గమనించండి :

రసాయనాలతో పండించిన పండ్లు పైన అంతా ఒకేలా మెరిసిపోయే పసుపు రంగులో ఉంటాయి. కానీ, సహజంగా పండిన పండ్లు అక్కడక్కడా ఆకుపచ్చగా, పసుపుగా ఉండి.. రంగు అసమానంగా ఉంటుంది. పండు మొత్తం పర్ఫెక్ట్ ఎల్లో కలర్ లో ఉంటే అది అనుమానించదగ్గదే.
వాసన చూడండి :
సహజంగా పండిన మామిడి పండు తొడిమ దగ్గర మంచి తీపి వాసన వస్తుంది. అదే రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లకు అస్సలు వాసన ఉండదు, లేదా ఒక రకమైన ఘాటైన కెమికల్ వాసన వస్తుంది.
తాకి చూడండి :
పండును మెల్లగా నొక్కినప్పుడు అది లోపలికి కొంచెం మెత్తగా ఉండి, పైన గట్టిగా ఉండాలి. కృత్రిమంగా పండిన పండ్లు పైన మెత్తగా ఉన్నా, లోపల కొన్ని చోట్ల గట్టిగా (పచ్చిగా) ఉంటాయి.
రుచి చూస్తే తెలిసిపోతుంది :
సహజమైన పండు నోట్లో పెట్టుకోగానే మంచి తీపిని, రసాన్ని ఇస్తుంది. అదే కెమికల్ వేసిన పండు తిన్నప్పుడు నోట్లో ఏదో పొడి పట్టినట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాత నోట్లో చేదు లేదా లోహపు రుచి కూడా వస్తుంది.
తెల్లటి పొడి ఉందా? :
మామిడి పండ్ల పైన లేదా తొడిమల దగ్గర తెల్లటి లేదా బూడిద రంగు పొడి లాంటిది కనిపిస్తే.. అది కాల్షియం కార్బైడ్ వాడినట్లు గుర్తు. సహజమైన పండ్ల చర్మం క్లీన్ గా, నునుపుగా ఉంటుంది.
నీళ్లలో వేసి పరీక్షించండి :
ఇది సులభమైన పద్ధతి. ఒక బకెట్ నీటిలో మామిడి పండ్లను వేయండి. సహజంగా పండిన పండ్లు బరువుగా ఉండి నీటి అడుగుకు చేరుతాయి. కానీ, రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లు లోపల గాలితో నిండి ఉండి నీటి పైన తేలుతాయి.
పండు కోసి చూడండి :
పండును కోసినప్పుడు లోపల గుజ్జు అంతా ఒకే రంగులో ఉంటే అది మంచి పండు. రసాయనాలు వేస్తే.. పండు పైన పసుపుగా ఉన్నా, లోపల గుజ్జు మాత్రం తెల్లగా లేదా లేత రంగులో ఉండి సరిగ్గా పండనట్టు కనిపిస్తుంది.