వడదెబ్బ నుంచి రక్షణ :

పచ్చి మామిడి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఇది శరీరాన్ని చల్లబరిచి, వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి మనల్ని రక్షిస్తుంది.
జీర్ణక్రియకు దివ్యౌషధం :
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు పచ్చి మామిడి చక్కని పరిష్కారం.
రోగనిరోధక శక్తి పెంపు :
విటమిన్ C, విటమిన్ A పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడుతుంది.
బరువు తగ్గడంలో సాయం :
పండిన మామిడితో పోలిస్తే ఇందులో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేసి, కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది.
గుండెకు, కాలేయానికి మేలు :
పచ్చి మామిడి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
దంతాల ఆరోగ్యం :
చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలను పచ్చి మామిడి తగ్గిస్తుంది. ఇది పళ్లు, చిగుళ్లను దృఢంగా ఉంచుతుంది.