మునగ ఆకు నుంచి వేరు వరకు 300 చిన్న, పెద్ద వ్యాధులను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
ఈ చెట్టు కాండం, వేరు, ఆకులు, కాయలు, పువ్వులు అన్నీ ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లేమేటరీ గుణాలు, ప్రొటీన్లు, కాల్షియం, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.
మునగ ఆకులు స్త్రీలకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి. విటమిన్ సి, ఎ, బి కాంప్లెక్స్ , పొటాషియం, కాల్షియం, ప్రొటీన్, సోడియం మొదలైనవి మునగలో పుష్కలంగా ఉంటాయి.
కీళ్లనొప్పులు, బెణుకులు, సయాటికా, కంటి వ్యాధులు, పక్షవాతం, అన్ని రకాల గ్యాస్ డిజార్ట్ లు, రాళ్లు, స్థూలకాయం , దంత వ్యాధులు వంటి మొదలైన వ్యాధుల్లో మేలు చేస్తుంది.
మునగ ఆకులు మహిళల్లో అసమతుల్య హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. థైరాయిడ్ పీసీఓఎస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
నొప్పి, తిమ్మిర్లు, వాపులు, మూడ్ స్వింగ్స్ వంటి సమయంలో వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మునగకాయలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
మునగ ఆకులు,కాయలను నిత్యం డైట్లో చేర్చుకున్నట్లయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.
అలసటను తొలగించడంలో మునగ అద్భుతంగా పనిచేస్తుంది. అలసట తగ్గించుకునేందుకు మనగ ఆకులతో చేసిన టీ తాగవచ్చు.
మునగ ఆకులు తింటే ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బోలు ఎముకల వ్యాధిని, ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.