సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి (ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి.
విడుదలైన తేదీ
2006 ఏప్రిల్ 28
ఫస్ట్ హీరో మహేశ్ కాదంట
తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్దం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయాడట.
ఫస్ట్ టైటిల్
ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్ కూడా చివర్లో పెట్టారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడట పూరి.
డెలాగ్స్
"ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు". "ఎప్పుడు వచ్చామని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా?" "ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను.."
ఫస్ట్ హీరోయిన్ ఎవరంటే
మొదట అయేషా టాకియాను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత కంగనా రనౌత్‌ని అనుకున్నా.. ఆమె కూడా హ్యాండించింది. అలా ఇలియానాకు ఛాన్స్ దక్కింది.
ఢిపరెంట్ లుక్ లో ప్రిన్స్
తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్ దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు మహేశ్ బాబు.
100 రోజులు
ఈ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది.
బాక్సాఫీస్ షేక్
దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది.