రూ.10 లక్షలు ఎఫ్‌డీలో పెడితే..

రూ.10 లక్షల డిపాజిట్‌పై బ్యాంకు ఇచ్చే వడ్డీ ఆధారంగానే మీకు వచ్చే ఆదాయం నిర్ణయమవుతుంది. రేటు ఎక్కువైతే వడ్డీ ఆదాయం కూడా పెరుగుతుంది.
6 శాతం వడ్డీ వస్తే..
10 లక్షలకు ఏడాదికి 6 శాతం వడ్డీ అంటే రూ.60,000 వస్తుంది. దీనిని నెలవారీగా లెక్కిస్తే సుమారు రూ.5,000 ఆదాయం అవుతుంది.
6.5 శాతం అయితే ఎంత?
6.5 శాతం వడ్డీ లభిస్తే ఏడాదిలో రూ.65,000 వరకు వడ్డీ రావచ్చు. నెలకు సగటున సుమారు రూ.5,417 అందుతుంది.
7 శాతం వడ్డీకి లెక్క ఇదే
7 శాతం రేటుతో రూ.10 లక్షలపై సంవత్సరానికి రూ.70,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు సుమారు రూ.5,833 ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
7.5 శాతం వడ్డీ ఉంటే..
7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఏడాదికి రూ.75,000 వడ్డీ వస్తుంది. నెలవారీ లెక్కలో ఇది సుమారు రూ.6,250 అవుతుంది.
8 శాతం వడ్డీ లభిస్తే..
ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ వస్తే ఏడాదికి రూ.80,000 వరకు వడ్డీ లెక్క వస్తుంది. నెలకు సగటున సుమారు రూ.6,667 పొందవచ్చు.
నెలనెలా డబ్బు కావాలంటే..
ప్రతి నెలా వడ్డీ చేతికి రావాలంటే రెగ్యులర్ ఇంటరెస్ట్ పేమెంట్‌ ఉన్న ఎఫ్‌డీని ఎంచుకోవాలి. బ్యాంకును బట్టి నెలవారీ లేదా ఇతర వ్యవధుల్లో వడ్డీ చెల్లించే సదుపాయం ఉంటుంది.
క్యుములేటివ్ ఎఫ్‌డీ ఎలా ఉంటుంది?
క్యుములేటివ్ ఎఫ్‌డీలో వడ్డీని మధ్యలో తీసుకోకుండా అసలుకు కలుపుతారు. దీంతో మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా కలిపి అందుతుంది.
ఎఫ్‌డీపై పన్ను కూడా ఉంటుంది
ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీ మీ పన్ను పరిధిలోకి రావచ్చు. అందువల్ల వడ్డీ రేటుతో పాటు పన్ను తర్వాత నిజంగా చేతికి వ‌చ్చే మొత్తాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి.
ముందే ఎఫ్‌డీ తీసేస్తే?
మెచ్యూరిటీకి ముందే డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే బ్యాంకు నిబంధనల ప్రకారం పెనాల్టీ లేదా తక్కువ వడ్డీ వర్తించవచ్చు. కాబట్టి ఎఫ్‌డీ కాలవ్యవధిని ఎంచుకునే ముందు డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి.