బర్మింగ్‌హమ్‌ 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు 10 రోజులు

టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్‌లను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు.
కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు చోటు కల్పించడం ఇదే మొదటిసారి.
ఆగస్టు వరకు లీగ్‌ మ్యాచ్‌లు, ఆగస్టు 6న సెమీఫైనల్‌ జరగనుండగా...ఆగస్టు 7న ఫైనల్‌తో పాటు మూడో స్థానం కోసం పోటీలు నిర్వహిస్తారు.
కామన్వెల్త్‌ క్రీడల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి.
ప్రపంచ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించాయి.
ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్‌ బరిలోకి దిగనుంది.
ఒకే వెస్టిండీస్‌ జట్టుగా కాకుండా వేర్వేరు కరీబియన్‌ దేశాలు (ట్రినిడాడ్, జమైకా తదితర) పోటీ పడి వాటిలోంచి ఒక టీమ్ బరిలోకి దిగనుంది.
అలాగే 2022 జనవరిలో జరిగే క్వాలిఫయింగ్‌ టోర్నీ నుంచి మరో జట్టు అర్హత సాధిస్తుంది.