మానవత్వం చూపించిన యూత్ .. అమర జవాన్ కుటుంబానికి ఇల్లు కట్టించారు ..

మానవత్వం చూపించిన యూత్ .. అమర జవాన్ కుటుంబానికి ఇల్లు కట్టించారు ..
x
Highlights

నిజానికి అ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి . కానీ అ కుటుంబ పరిస్థితిని చూసి యువత చలించిపోయి అ కుటుంబాన్ని ఆదుకొని ఆదర్శంగా నిలిచింది . ఓ అమర జవాన్...

నిజానికి అ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి . కానీ అ కుటుంబ పరిస్థితిని చూసి యువత చలించిపోయి అ కుటుంబాన్ని ఆదుకొని ఆదర్శంగా నిలిచింది . ఓ అమర జవాన్ కుటుంబానికి ఇల్లు కట్టించి 73 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికీ అ ఇంటిని కానుకగా ఇచ్చారు .. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది . మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని బెట్మా గ్రామానికి చెందిన మోహన్ సింగ్ అనే జవాన్ 1992 లో విధి నిర్వహణలో భాగంగా తన ప్రాణాలను కోల్పోయాడు . కానీ ఆయనది పేద కుటుంబం .. పూరి గుడిసెలో అతని కుటుంబం నివాసం ఉండేవారు . మోహన్ సింగ్ చనిపోయే నాటికీ అతనికి మూడేళ్ళ కొడుకు మరియు అతని భార్య గర్భిణిగా ఉంది . అతను చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తన భార్య మీద పడింది .

అయితే కొద్దిరోజులు క్రితం వర్షాలు దాటికి అ ఉన్న పూరి గుడిసె కూడా కూలిపోయింది . దీనితో అతని కుటుంబానికి నీడ అన్నది లేకుండా పోయింది . ఇది చూసి చలించి పోయిన అ గ్రామంలోని యువత ముందుకు వచ్చి "ఒక చెక్కు-ఒక సంతకం" అనే కార్యక్రమాన్ని చేపట్టింది ... ఈ కార్యక్రమం కింద మొత్తం 11 లక్షలు సేకరించి మొత్తం 10 లక్షల రూపాయలతో అమర జవాన్ ఇంటికి కొత్త ఇల్లు కట్టించారు . మోహన్ సింగ్ భార్యను తమ చేతులమీదిగా కొత్త ఇంట్లోకి నడిపించి స్వాగతం పలికారు . ఇక మిగిలిన డబ్బుతో గ్రామంలో మోహన్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నారు . అయితే ఈ సందర్భంగా మోహన్ సింగ్ భార్య అ గ్రామంలోని యూత్ కి రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపింది ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories