సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
x
Highlights

కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-JKLF ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది....

కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-JKLF ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. యాసిన్ మాలిక్ నేతృ త్వంలోని నడుస్తున్న ఈ సంస్థ ఏర్పాటువాదం ముసుగులో ఉగ్రవాదులను ప్రోత్సాహిస్తునట్టు గుర్తించింది. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్‌ను భారతదేశం నుంచి విడదీయాలనే ప్రయత్నాలకు J.K.L.F ఊతమిస్తోందని, అందుకే ఆ సంస్థను నిషేధిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.

ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్మూ కశ్మీర్ వ్యవహారాలు, దేశ భద్రతపై చర్చించారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కిందం J.K.L.Fను నిషేధించారు. కాగా గతంలో కూడా జమాతే ఇస్లామీ జమ్ముకశ్మీర్ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. ఇదిఅలావుంటే J.K.L.Fను నిషేధించడంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories