అప్పు తీర్చలేదని మహిళను కట్టేసి చెప్పులతో దాడి

కర్నాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను నడిరోడ్డుపై విద్యుత్ స్తంభానికి...
కర్నాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను నడిరోడ్డుపై విద్యుత్ స్తంభానికి కట్టేసి అమానుషంగా ప్రవర్తించారు. కొడిగిహళ్లిలో జరిగిన ఈ దారుణం కర్నాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. కర్నాటక చామరాజనగర్ జిల్లా కొడిగిహళ్లిలో చిన్న హోటల్ నడుపుకుంటోన్న రాజమణి స్త్రీ శక్తి పొదుపు సంఘం నుంచి 11లక్షల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా ఊరి నుంచి పారిపోయిందంటూ కొందరు గ్రామస్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నెలరోజుల తర్వాత గ్రామానికి వచ్చిన మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. చెప్పులు, చీపుర్లతో కొడుతూ అవమానించారు.
అయితే అటుగా వెళ్తున్న వారంతా చోద్యం చూశారే తప్ప నిస్సహాయస్థితిలో ఉన్న బాధితురాలిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ దుర్మార్గులను ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఈ దారుణాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT