భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య

భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య
x
Highlights

భర్త పరాయిస్త్రీతో సహజీవనం చేస్తున్నాడు అని తెలిస్తే చాలు భర్తని అతనితో సహజీవనం చేస్తున్న ఆమెని పట్టుకుని పోలీసులకు అప్పగించడం చాలా చోట్ల చూస్తూనే...

భర్త పరాయిస్త్రీతో సహజీవనం చేస్తున్నాడు అని తెలిస్తే చాలు భర్తని అతనితో సహజీవనం చేస్తున్న ఆమెని పట్టుకుని పోలీసులకు అప్పగించడం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. కానీ ఈమె మాత్రం భర్త ఏ మహిళతో అయితే సహజీవనం చేస్తున్నాడో ఆమెతోనే భర్తకు పె‌ళ్లి చేసింది ఓ భార్య. వింటుంటే ఇదేదో సినిమా కథలాగా అనిపిస్తుంది కదా. తన భర్త మరో మహిళతో ఉన్న విషయం తెలుసుకున్న భార్య అన్నీ తానై తన భర్తకు రెండో పెళ్లి చేసింది. వారి కుటుంబ సభ్యులను, గ్రామస్తులను అందరినీ ఒప్పించి ఈ పెళ్లి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

మత్తిలి సమితి కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రితో పెళ్లి జరిగింది. ఇతను రోజు కూలీపనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కూలీ పనులకు వెళ్లే క్రమంలోనే అతనికి ఐత మడకామి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తరువాత ఆ ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇలా కొన్ని రోజులు నడుస్తుండగా ఐత అనే మహిళ రామని పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి రామ నిరాకరించడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. రామ తనకు ఇంతక ముందే పెళ్లయిందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో ఐత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న రామ కావసీ భార్య గాయత్రి తన భర్త జైలు పాలైతే తన కుటుంబం వీధిన పడుతుందని ఆ ఇద్దరికీ పెళ్లి చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories