జనవరి 26 నే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి?

జనవరి 26 నే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి?
x
Highlights

మనదేశంలో ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలని, జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అయితే

మనదేశంలో ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలని, జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈ రెండు రోజుల్లో కూడా జాతీయ జెండాను ఎగరవేసి, సీట్లు పంచుకొని ఆనందంగా జరుపుకుంటాం. అయితే జనవరి 26నే గణతంత్ర దినోత్సవ వేడుకలని ఎందుకు జరుపుకోవాలి అదే రోజు మళ్ళీ జెండాను ఎందుకు ఎగరవేయాలి అన్న ప్రశ్నలకి సమాధానాలు చాలా మందికి తెలియవు.

భారతదేశంలో పుట్టిన మనిషికి మాట్లాడే హక్కు ఉంది. మరి ఆ హక్కు మనిషికి ఎక్కడిది? మనషి తనకి ఇష్టమైన మతంలోకి వెళ్ళొచ్చు అన్న హక్కు ఎక్కడిది? అందరు చదువుకునే అర్హత ఎలా వచ్చింది? ఏమైనా గొడవలు జరిగితే న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించే హక్కు మనకి ఎవరు కలిపించారు. ఇలాంటి ప్రశ్నలకి రాజ్యాంగం మనకి కల్పించింది.

1947 ఆగస్టు 15 న మన దేశానికి కేవలం స్వాతంత్ర్యం మాత్రమే వచ్చింది. కానీ సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాదు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటితోనే పాలన సాగుతుంది. కానీ ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకి ఉండాలని అప్పటి నాయకులు, మేధావులు భావించారు. ఆ ఫలితమే రాజ్యాంగ పరిషత్తు ఆవిర్భావం.. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది.

అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. 1949న నవంబర్ 26 న అంబేద్కర్ సారధ్యంలో పూర్తి అయన రాజ్యాంగ పరిషత్తు దీనికి ఆమోదన ముద్ర వేసింది. అతిపెద్ద రాజ్యాంగంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇక దీనిని మరో రెండు నెలలు ఆగి అంటే 1950 జనవరి 26న అమల్లోకి తీసుకువచ్చారు. ఇక అప్పటినుంచి భారతదేశం కేవలం స్వాతంత్ర్య దేశం మాత్రమే కాదు సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశం కూడా..

అయితే జనవరి 26 నే ఎంచుకోవడానికి కూడా బలమైన కారణమే ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణస్వరాజ్ ని ఆ రోజునే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యం అయిన రాజ్యాంగం అమలు ఈరోజున చేయాలనీ నిర్ణయించారు. అలా 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనినే గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. అదే రోజున స్వాతంత్ర్య దినోత్సవంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను కూడా ఎగరవేశారు.

తొలి గణతంత్ర వేడుకలని మూడు రోజులు జరిపారు. ఆ రోజున భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేసి సైనిక వందనం చేయడం ఓ ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా ఎదో ఒక దేశం నుంచి ప్రముఖులను మనదేశానికి ఈ రోజున ఆహ్వానించి సకల లాంచనాలతో వారిని సత్కరించడం కూడా ఓ ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ 1976 నుంచి వస్తుంది. ఇక రాష్ట్రాలలో గవర్నర్లు జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇలా ఆ గణతంత్ర వేడుకలకి 70 సంవత్సరాలు నిండాయి. ఇప్పుడు దేశమంతటా 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories