logo
జాతీయం

అభినందన్‌ పక్కనే ఉన్న మహిళ ఎవరంటే..

అభినందన్‌ పక్కనే ఉన్న మహిళ ఎవరంటే..
X
Highlights

భారత వింగ్ కమాండర్ అభినందన్ నిన్న రాత్రి సరిగ్గా 9 గంటల 20 నిమిషాలకు భారత భూభాగంలో అడుగుపెట్టారు. వాగా బార్డర్ ...

భారత వింగ్ కమాండర్ అభినందన్ నిన్న రాత్రి సరిగ్గా 9 గంటల 20 నిమిషాలకు భారత భూభాగంలో అడుగుపెట్టారు. వాగా బార్డర్ చేరుకున్న ఆయనకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య భారత్ కు అప్పగించింది పాక్.. ఈ సమయంలో ఓ మహిళ ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఆ మహిళ ఎవరా అని అందరూ ఆరాతీశారు.ఈ క్రమంలో సదరు మహిళ అభినందన్ భార్య అని.. మరికొందరు ఫ్యామిలీ మెంబెర్ అని అనుకున్నారు. అయితే ఆమె అభినందన్ భార్య కాదు ఫ్యామిలీ మెంబెర్ కాదు..

ఆమె పాకిస్థాన్ విదేశీ కార్యాలయంలో భారత డైరెక్టర్. పేరు డాక్టర్ ఫారిహ బుగ్తి, ఆమె FSP ( IFS కు సమానం) అధికారి మరియు భారత విదేశాంగ కార్యాలయంలో (విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రతినిధి) భారత వ్యవహారాలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. పాక్ బందిఖానాలో ఉన్న కుల్భూషణ్ జాధవ్ కేసును విచారించే పాక్ అధికారులలో ఆమె కూడా ఒకరు. జాదావ్ ఒక భారతీయ గూఢచారి అని పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. గత ఏడాది ఇస్లామాబాద్లో జాదవ్ తల్లి, భార్య మధ్య జరిగిన సంభాషణలో ఆమె కూడా పాల్గొన్నారు.

Next Story