వాట్సప్ యూజర్లకు శుభవార్త...అది ఏంటో తెలుసా..?

వాట్సప్ యూజర్లకు శుభవార్త...అది ఏంటో తెలుసా..?
x
Highlights

వాట్సప్ యూజర్లకు శుభవార్త. భారతదేశంలో ఇప్పటికే కొన్ని యాప్స్ పేమెంట్స్ సర్వీస్ లను ప్రారంభించాయి.

వాట్సప్ యూజర్లకు శుభవార్త. భారతదేశంలో ఇప్పటికే కొన్ని యాప్స్ పేమెంట్స్ సర్వీస్ లను ప్రారంభించాయి. షావోమీ ఎంఐ క్రెడిట్, రియల్‌మీ పేసా లాంటి యాప్స్‌లో లోన్స్ తీసుకోవచ్చు. మరోవైపు అమెజాన్ కూడా పే లేటర్ పేరుతో వడ్డీలేని రుణాలు ఇస్తోంది. ఇందుకోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్. అమెజాన్‌ లాగానే ఫ్లిప్‌కార్ట్ కూడా రుణాలను అందిస్తోంది.

అదే విధంగా ఇప్పుడు వాట్సప్ కూడా లెండింగ్ సర్వీసెస్‌ని ప్రారంభించే ఆలోచనలో ఉంది. పేమెంట్స్ సర్వీసులను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతులు కోసం ఎదురుచూస్తోంది. ఈ అనుమతులు రాగానే యూజర్లు వాట్సప్ నుంచే పేమెంట్స్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతే కాదు ఈ పేమెంట్ సిస్టమ్ విజయవంతం అయితే వెంటనే లోన్ మార్కెట్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది వాట్సప్. ఈ నేపథ్యంలోనే వాట్సప్ సంస్థ కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తమ బిజినెస్ వివరాలను వెల్లడించింది. పేమెంట్స్‌తో పాటు క్రెడిట్ సేవల్ని కూడా అందిస్తామని తెలిపింది. మే నాటికి ఈ వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories