విక్రమ్‌ను ల్యాండర్ ను మేము ముందే గుర్తించాం : శివ‌న్‌

విక్రమ్‌ను ల్యాండర్ ను మేము ముందే గుర్తించాం : శివ‌న్‌
x
ఇస్రో చైర్మన్ శివ‌న్
Highlights

విక్రమ్ కూలిన ప్రదేశాన్ని నాసా ప‌సిక‌ట్టక‌ముందే త‌మ ఆర్బిటార్ ఆ ల్యాండ‌ర్‌ను గుర్తించిందని ఇస్రో చైర్మన్ తెలిపారు.

విక్రమ్ కూలిన ప్రదేశాన్ని నాసా ప‌సిక‌ట్టక‌ముందే త‌మ ఆర్బిటార్ ఆ ల్యాండ‌ర్‌ను గుర్తించిందని ఇస్రో చైర్మన్ తెలిపారు. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో శివ‌న్ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని ప్రజలముందుకు తీసుకువచ్చారు.

అయితే మంగళవారం చంద్రయాన్‌2కు చెందిన విక్రమ్ ల్యాండ‌ర్‌ను గుర్తించిన‌ట్లు అమెరికాకు చెందిన నాసా వెల్లడించిన విష‌యం అందరికీ తెలిసిందే. విక్రమ్ ఏ ప్రదేశాల్లో కూలిందో డేటాతో పాటుగా విక్రమ్ ల్యాండ‌ర్ వాటికి సంబంధించిన ఫోటోల‌ను కూడా ఆ స్పేస్ ఏజెన్సీ త‌న ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ప్రాంతాన్నిగుర్తించ‌డంలో భార‌తీయ యువ ఇంజినీర్ ష‌ణ్ముగ సుబ్రమ‌ణియ‌న్ కూడా కీల‌క పాత్ర పోషించాడని ఆయనని కొనియాడారు నాసా సెంటర్ వారు.

దీంతో ఈ విషయాలన్నింటిపై ఇస్రో చైర్మన్ కే.శివ‌న్ స్పందించారు. విక్రమ్ కూలిన ప్రదేశాన్ని త‌మ ఆర్బిటార్ ముందే గుర్తించిందని స్పష్టం చేశారు. ఈ విష‌యాన్నింటినీ ఇస్రోకు సంబంధించిన వెబ్‌సైట్‌లో కూడా భద్రపరిచామని ఆయన తెలిపారు. ఈ విషయాలను గురించి క్షుణ్ణంగా తెలుసకోవానుకున్న వారు ఇస్రో వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి తెలుకోవచ్చన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories