తీవ్ర నీటి స‌మ‌స్యతో ఇబ్బంది పడుతున్న చెన్నై ... లాతూర్‌ తరహాలో చెన్నైకి నీటి తరలింపు

తీవ్ర నీటి స‌మ‌స్యతో ఇబ్బంది పడుతున్న చెన్నై ... లాతూర్‌ తరహాలో చెన్నైకి నీటి తరలింపు
x
Highlights

చెన్నై మ‌హాన‌గ‌రం తీవ్ర నీటి స‌మ‌స్యతో ఇబ్బందిప‌డుతోంది. అయితే ఇవాళ వెల్లూర్ నుంచి చెన్నైకు ఓ ప్రత్యేక రైలును తీసుకెళ్లారు. నీటి బోగీల‌తో ఆ రైలు ఇవాళ...

చెన్నై మ‌హాన‌గ‌రం తీవ్ర నీటి స‌మ‌స్యతో ఇబ్బందిప‌డుతోంది. అయితే ఇవాళ వెల్లూర్ నుంచి చెన్నైకు ఓ ప్రత్యేక రైలును తీసుకెళ్లారు. నీటి బోగీల‌తో ఆ రైలు ఇవాళ ఉద‌యం జోలార్‌పేట్ రైల్వే స్టేష‌న్ నుంచి బ‌య‌లుదేరింది. రైల్వే వ్యాగ‌న్ల ద్వారా నీటిని చెన్నైకు తీసుకువెళ్లినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో ఆ రైలు చెన్నై స్టేష‌న్‌కు చేరుకుంది.

50 బోగీల్లో సుమారు 50 వేల లీట‌ర్ల నీళ్లు ఉన్నాయి. విల్లివ‌క్కం వ‌ద్ద తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆ రైలుకు స్వాగ‌తం ప‌లికారు. వ్యాగ‌న్లలో ఉన్న నీటిని.. కిల్‌పాక్ వాట‌ర్ వ‌ర్క్స్‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కిల్‌పాక్ వాట‌ర్ వ‌ర్క్స్ నుంచి నీటిని న‌గ‌ర‌మంతా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. మొత్తం రెండు రైళ్ల ద్వారా నీటిని త‌ర‌లించారు అధికారులు. ఒక రైలు జోలార్‌పేట్ నుంచి, మ‌రో రైలు అవ‌ది రైల్వే యార్డ్ నుంచి చెన్నైకి చేరుకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories