Top
logo

పోయి మీ బ్యాంకులను అడగండి.. నెటిజన్లపై మాల్యా సీరియస్

పోయి మీ బ్యాంకులను అడగండి.. నెటిజన్లపై మాల్యా సీరియస్
Highlights

బ్యాంకుల సొమ్ము ఎగ్గొట్టి విదేశాల్లో జల్సా చేస్తున్న విజయ్ మాల్యా నెటిజన్ల పై సీరియస్ అయ్యాడు. ఇటీవల...

బ్యాంకుల సొమ్ము ఎగ్గొట్టి విదేశాల్లో జల్సా చేస్తున్న విజయ్ మాల్యా నెటిజన్ల పై సీరియస్ అయ్యాడు. ఇటీవల వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ విజయమాల్యాతో కల్సి ఫోటో దిగి దానిని ట్విటర్‌లో ఉంచాడు. ఆ ఫోటోపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేశారు. 'బిగ్‌బాస్‌ను కలుసుకోవడం బాగుంది' అంటూ గేల్ చేసిన క్యాప్షన్ కి నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మాల్యా గొప్ప దేశభక్తుడు.. అతను కేవలం భారతీయులనే దోచుకుంటాడు.' అని ఒకరు.. 'తనకు ఇష్టమైన బీటీడబ్ల్యూ లాకెట్‌ కోసం.. ఆఖరికి క్రిస్‌గేల్‌ కూడా మాల్యా కోసం ఎదురుచూస్తున్నాడు.' అంటూ మరొకరు కామెంట్‌ చేశారు దీనితో మాల్యా ట్విటర్‌ వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్ను 'చోర్‌' అని పిలుస్తున్న అందరూ.. గతేడాది నుంచి డబ్బులు మొత్తం చెల్లిస్తానని చెబుతున్నా.. తీసుకోని మీ బ్యాంకులను అడగండి. అప్పుడు దొంగెవడో తేల్చండి.' అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. 'యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌తో ఉన్న నా ఫొటోను చూసి కామెంట్‌ చేశారో.. వారు దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. మాల్యా ఇస్తానన్న 100శాతం డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదో మీ బ్యాంకులను ప్రశ్నించండి' అని మరో ట్వీట్‌లో మండిపడ్డాడు. మాల్యా గతంలో ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కూడా అక్కడి భారతీయులు చోర్..చోర్.. అని కేకలు వేసి మాల్యాను గేలి చేశారు.

Next Story