Valentine Week 2020 Teddy Day: టెడ్డీ ఎందుకు గిఫ్ట్‌గా ఇస్తారో తెలుసా?

Valentine Week 2020 Teddy Day: టెడ్డీ ఎందుకు గిఫ్ట్‌గా ఇస్తారో తెలుసా?
x
Highlights

టెడ్డీ బేర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరూ వీటిని ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ టెడ్డీలంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు.

టెడ్డీ బేర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరూ వీటిని ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ టెడ్డీలంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు. అందుకే కాబోలు ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో హీరోయిన్ కన్నా ముందు టెడ్డీని చూపించి ఆ తరువాత హీరోయిన్ ని చూపిస్తారు. అంటే ఇక్కడే అర్థం అవుతుంది టెడ్డీలకు ఎంత క్రేజ్ ఉందో. అంతే కాదు అమ్మాయిలు ఈ టెడ్డి బేర్ లనే తన బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తారు. ఇంట్లో ఉన్నంత సేపు ఇక్క క్షణం కూడా ఈ టెడ్డీలను విడిచి పెట్టకుండా ఉంటారు. టెడ్డీలకి వారికి ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు.

మామూలుగానే మృదుస్వభావమైన అమ్మాయిలు టెడ్డీ బేర్స్ మృదుత్వాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు. దూదిపింజల్లా మెత్తగా ఉండే వీటిని చిన్నప్పట్నుంచే ఎంతగానో ఇష్టపడతారు. పడుకునే ముందు వాటిని పక్కన పెట్టుకునే పడుకుంటారు. అంతే కాదు అమ్మాయిలతో పాటుగానే చిన్న పిల్లల్లో దాదాపుగా 60-70% మంది టెడ్డీలతో అటాచ్‌మెంట్‌ పెంచకుంటారు.

ఇకపోతే బ్రిస్టల్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, పిల్లలకు వారికీ ఇష్టమైన వస్తువులపై చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం ఉంటుంది.

దానికి ఓ పేరు పెట్టుకుని... వాటితోనే స్నేహం చేస్తుంటారు. అన్ని విషయాలను వాటితతో షేర్ చేసుకుంటారు. వాటిని విడిచి పెట్టనంతగా ఇష్టపడతారు. ఆ బొమ్మ లాంటిదే మరో బొమ్మని తీసుకొచ్చినా కూడా పిల్లలు అసలు దాన్నే ఉంచుకుంటారు. తమకు ఇష్టమైన వస్తువును ఒక విలువైన ఆస్తిలా భావిస్తారు. అంతే కాదు పిల్లలకు ఏమైనా బాధ అనిపించినా అప్పుడు వారికి ఇష్టమైన వస్తువులతో షేర్ చేసుకుంటారు. అందులోనూ ముఖ్యంగా ఈ టెడ్డీలతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. దీంతో వారి ఒత్తిడి కూడా దూరమై వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమయంలో వారిని ఆ బోమ్మల నుంచి దూరం చేస్తే పిల్లలు మానసికంగా చాలా బలహీన పడతారని చెపుతున్నారు. అందుకే పిల్లలకు కంఫర్ట్ వస్తువుల నుంచి వచ్చే సానుకూల ప్రయోజనాను వాటి నుంచి దూరం చేయకపోవడమే మంచిది.

ఇకపోతే చాలామంది వ్యక్తులు మాత్రం చిన్నప్పటి నుంచి ఇష్టపడే వస్తువులని పెద్ద అయ్యాక అంతగా ఇష్టపడరు. ఇంకొంత మంది చాలా మందికి ఇవంటే ఇష్టం ఉన్నపటికీ వారు బయటికి చెప్పరు. ఎవరు ఏమనుకుంటారో అనే చిన్న భయంతో 10% ఒంటరి పురుషులు వారి భాగస్వామి వచ్చాక వాటిని దాచేస్తారు. అంతే కాదు వివాహిత పురుషులలో 14% మంది వాటిని దాచేస్తుంటారు. వయస్సు పెరిగే కొద్దీ ఈ వస్తువులు అన్ని చిన్ననాటి బొమ్మలుగా లేదా ఓదార్పుగా కనిపిస్తున్నా కూడా వాటి కోసం కాస్త ఇబ్బంది పడతారు.

ఇక పోతే ప్రస్తుతం కొంతమంది పరిశోధకులు తెలిపిన ప్రకారం పిల్లలతో పాటు, పెద్దలు కూడా వాటిని ఇష్టపడతారని తెలిపారు. బ్రిటీష్ పెద్దలలో మూడింతల మంది టెడ్డి బేర్‌తో నిద్రపోతున్నారని, 25% మంది పురుషలు వ్యాపార పర్యటనలకు కూడా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వాటిని చూడగానే ఖచ్చితంగా వారి ముఖాల్లో చిరునవ్వు వస్తుంది.

ఇక ఈ టెడ్డీ బేర్స్ అమ్మాయిలకే కాదు అందరికీ ఓదార్చుతుంది. చాలా మందికి చిన్నతనంలో వారికి టెడ్డి బేర్స్ ఉండే ఉంటాయి కానీ, కొంత వయసు వచ్చాక వారు వాటిని విడిచి పెడతారు. కాబట్టి, మీ మంచం మీద టెడ్డీ బేర్ ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గుతుంది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతే కాదు టెడ్డీ డే రోజున ప్రియురాలికి టెడ్డీని గిఫ్ట్ గా ఇచ్చే ప్రియుడు 'ఆ టెడ్డీని నేనవుతా అనే ఉద్దేశ్యంతో ఇస్తాడట.

ఇక ఈ వారం వాలెంటైన్ వీక్ అవడంతో ప్రేమ ఆనందాన్ని రెట్టింపు చేసే ప్రతీ వస్తువుకి వాలెంట్స్‌ వీక్‌లో స్థానం ఉంది. అందులో టెడ్డీ డే కూడా ఒకటి. అదే టెడ్డీస్ మాయాజాలం. అందుకే అమ్మాయిలు వీటికి ఎప్పుడూ ఫ్యాన్సే. వాటిని చూడగానే ఖచ్చితంగా వారి ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. అందుకే.. వాళ్లని ఇంప్రెస్ చేయడానికి టెడ్డీస్‌ని కూడా ఇస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories