వలస కార్మికులను వెనక్కి... యోగి ప్రభుత్వం మరో నిర్ణయం

వలస కార్మికులను వెనక్కి... యోగి ప్రభుత్వం మరో నిర్ణయం
x
Yogi Adityanath (File Photo)
Highlights

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ల‌క్షలాది వ‌ల‌స కూలీలు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ల‌క్షలాది వ‌ల‌స కూలీలు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అందులో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలే ఎక్కువగా ఉన్నారు. అయితే తమ రాష్ట్రానికి చెందిన వ‌ల‌స కూలీలను తిరిగి వెన‌క్కి తీసుకురావలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ అధికారులతో ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో త‌మ రాష్ట్రానికి చెందిన వ‌ల‌స కూలీల‌ను వెనక్కి ర‌ప్పించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

ఇక ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వ్యక్తుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అయన కోరారు అక్కడ 14 రోజులు క్వారంటైన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, క‌రోనా ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. నెగిటివ్‌గా తేలిన త‌ర్వాతే నిర్బంధాన్ని పూర్తి చేశారు, తద్వారా వారు దశలవారీగా ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఆ తర్వాత వారికి రేషన్ కిట్లు రూ .1000 భత్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. లాక్ డౌన్ విధించడంతో ఉత్తర ప్రదేశ్ నుండి వేలాది మంది వలస కార్మికులు వేర్వేరు నగరాల్లో చిక్కుకున్నారు. చాలామంది తమ స్వగ్రామాలకు కాలినడకన ప్రయాణాలు చేపట్టారు, కానీ వారిని రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆగి సహాయ శిబిరాల్లో ఉంచారు.

అంతకుముందు, రాజస్థాన్ లోని ప్రసిద్ధ కోచింగ్ కోటాలో చిక్కుకున్న యుపి విద్యార్థులని తిరిగి ఇంటికి రావడానికి సిఎం ఆదిత్యనాథ్ బస్సులను పంపారు. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు 1,510 కేసులు నమోదు కాగా, 206 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనాతో పోరాడి 24 మంది మృతి చెందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories