లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం
x
Yogi Adithyanath (File Photo)
Highlights

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా పలు అంశాల్లో రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ క్రమంలో యుపీ సర్కార్ సోమవారం సాయింత్రం కొన్ని సడలింపులను జారీ చేసింది. మే 31 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ ఈ సడలింపు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ మంత్రులతో మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు.

1. కంటైన్మెంట్‌ జోన్లు మినహా ప్రాంతాల్లో వీధి వ్యాపారులు కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.

2. రెస్టారెంట్లు, స్వీటు షాపులు హోం డెలివరీ చేసుకోవచ్చు.

3. మెట్రో రైలు సేవలు, విద్యాసంస్థలు, సినిమా హాళ్ళు మరియు షాపింగ్ మాల్స్ యొక్క దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలపై పూర్తి నిషేధం.

4. మ్యారేజీ హాళ్లు తెరచుకోవచ్చు. దీనికి 20 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు.

5. కూరగాయల మార్కెట్లు ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచాలి. ఇక రిటైల్‌ వెజిటబుల్‌ మండీలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు తెరవాలి.

6.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ బౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి.. అంతేకాకుండా షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఎవరినా చర్యలను ఉపక్రమిస్తే చర్యలు తప్పవు.

7. కార్లు తదితర వాహనాల్లో డ్రైవర్‌ తో పాటుగా మరో ఇద్దరు వ్యక్తులకు అనుమతి. ఇక ద్వీచక్ర వాహనాల్లో ప్రయాణించేవారకి మాస్క్, హెల్మెట్, తప్పనిసరి

ఇదిలావుండగా, దేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు సంఖ్య లక్షకి చేరింది. అటు మరణించిన వారి సంఖ్య మూడు వేలకి చేరినట్టుగా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories