logo

అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణ అమలు చేయండి: సీఎం యోగి

అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణ అమలు చేయండి: సీఎం యోగి
Highlights

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. పరిపాలనశాఖ ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం అవినీతి అధికారులకు...

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. పరిపాలనశాఖ ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం అవినీతి అధికారులకు నిర్భంద పదవి విరమణ అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇక నుంచి అవినీతికి పాల్పడే అధికారులకు తన ప్రభుత్వంలో చోటు లేదని స్ఫష్టం చేశారు. అలాంటి అధికారుల పదోన్నతులను నిలిపివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీ ఉన్న వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఇకపై సచివాలయంలో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. అనుమతి లేకుండా సచివాలయంలోకి ఎవరినీ అనుమతించవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని యోగి అధికారులకు సూచించారు.


లైవ్ టీవి


Share it
Top