సీన్ రివర్స్.. పోలీసు కానిస్టేబులే పాలప్యాకెట్ల దొంగ...

సీన్ రివర్స్.. పోలీసు కానిస్టేబులే పాలప్యాకెట్ల దొంగ...
x
సీన్ రివర్స్.. పోలీసు కానిస్టేబులే పాలప్యాకెట్ల దొంగ...
Highlights

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుంది. సేమ్‌టు సేమ్‌ అదే సీన్‌ను రిపీట్‌ చేశాడో పోలీస్‌. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఓ పోలీస్‌ ఏకంగా దొంగ...

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుంది. సేమ్‌టు సేమ్‌ అదే సీన్‌ను రిపీట్‌ చేశాడో పోలీస్‌. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఓ పోలీస్‌ ఏకంగా దొంగ అవతారం ఎత్తాడు. అర్ధరాత్రి సిటీలో దొంగతనాలు, ఆకతాయిల చేష్టలను అరికట్టాల్సిందిపోయి ఏకంగా మనోడే దొంగతనానికి దిగడం హాట్‌టాపిక్‌గా మారింది.

నోయిడాలో పెట్రోలింగ్ చేస్తోన్న ఓ పోలీసు ముఖానికి రుమాలు చుట్టుకుని తనను ఎవరూ చూడడం లేదనుకుని చీప్‌గా పాల ప్యాకెట్లను దొంగతనం చేశాడు. సదరు పోలీస్‌ పాల ప్యాకెట్లు దొంగతనం చేస్తుండగా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ తతంగమంతా రికార్డయింది. ఖాకీ కక్కుర్తి పడిన ఘటన వైరల్‌గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు పాలప్యాకెట్ల పోలీసు దొంగ గురించి ఆరా తీస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories