ఉన్నావ్‌ అత్యాచార కేసులో కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు జీవిత ఖైదు

ఉన్నావ్‌ అత్యాచార కేసులో కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు జీవిత ఖైదు
x
Highlights

ఉన్నావ్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు చెప్పింది....

ఉన్నావ్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

ఉన్నావ్ హత్యాచారం కేసు ఎన్నో మలుపులు తిరిగింది. బాధితురాలి కుటుంబంపై పలుమార్లు హత్యాయత్నం కూడా జరిగింది. 2017లో కేసు నమోదు కాగా ఇప్పుడు కుల్దీప్ సెంగార్‌కు శిక్ష ఖరారు చేసింది. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌పై కిడ్నాప్, సామూహిక అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుల్దీప్ సెంగార్‌, అతనికి సహకరించిన శశిసింగ్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

మరోవైపు అత్యాచార బాధితురాలి తండ్రిపై అక్రమాయుధాలు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఉండగానే ఆయన ప్రాణాలు వదిలారు. గత జులైలో బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు మరణించారు. ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది సెంగారే చేయించాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బాధితురాలికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమె కుటుంబానికి సీఆర్పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించింది. ఇటు పరిస్థితిని సమీక్షించిన సుప్రీంకోర్టు కేసును లక్నో బెంచ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

ఇటీవల దుండగులు బాధితులరాలిని సజీవంగా తగులబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇటీవలే కుల్దీప్ సెంగార్‌ ను దోషిగా తేల్చిన తీజ్ హజరే కోర్టు ఇప్పుడు తాజాగా సెంగార్ కు జీవిత ఖైదీ విధిస్తూ శిక్షను ఖరారు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories