పొగాకు ఉత్పత్తులుపై ఇక ఆ ఫోటోలు కనిపించవు!

పొగాకు ఉత్పత్తులుపై ఇక ఆ ఫోటోలు కనిపించవు!
x
Highlights

పొగాకు ఉత్పత్తులుపై ఇప్పటివరకు ముద్రిస్తున్న ఫొటోలో స్థానంలో కొత్త ఫోటోలను ముద్రించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం...

పొగాకు ఉత్పత్తులుపై ఇప్పటివరకు ముద్రిస్తున్న ఫొటోలో స్థానంలో కొత్త ఫోటోలను ముద్రించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలతో కూడిన కొత్త ఛాయాచిత్రాలను ముద్రించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ,తాంబకు లాంటి పలు ఉత్పత్తుల పైన ఆరోగ్యానికి హానికరం అంటూ హెచ్చరించేలా ఉండే ఫోటోల స్థానంలో కొత్త ఫోటోలు కనిపించనున్నాయి.

ఇవి 2020 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన రెండు వేర్వేరు ఫొటోలను జారీ చేసింది. సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై నోటి కేన్సర్‌కు సంబంధించిన ఫొటోలను ముద్రించి ఉన్నప్పటికీ.. ఈ సారి వాటి సైజును పెంచబోతోంది. దీనివలన పొగాకు వినియోగదారులలో అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని, అంతేకాకుండా ప్రవర్తన మార్పును ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

12 నెలల పాటు సిగరెట్, బీడీ, గుట్కా ప్యాకెట్లపై ఆ ఫొటోలు కొనసాగుతాయి. అనంతరం వచ్చే ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మరో రెండు కొత్త ఫొటోలను ముద్రించాల్సి ఉంటుంది. ఫోటోలపై ఆరోగ్య పరమైన చర్యలన ముద్రించాలని, దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే జైలు శిక్ష లేదా జరిమానా కట్టాల్సి ఉంటుందని జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories