మరి కొద్ది సేపట్లో కేంద్ర బడ్జెట్..

మరి కొద్ది సేపట్లో కేంద్ర బడ్జెట్..
x
Highlights

నిర్మలాసీతారామన్ తొలి బడ్జెట్. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత దేశానికి తొలిసారిగా ఒక మహిళా మంత్రి ఆర్ధిక శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు...

నిర్మలాసీతారామన్ తొలి బడ్జెట్. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత దేశానికి తొలిసారిగా ఒక మహిళా మంత్రి ఆర్ధిక శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు నిర్మలాసీతారామన్. రెండోసారి కొలువు తీరిన మోడీ సర్కారు ఆమెను ఆర్తికశాఖా మంత్రిగా ప్రకటించగానే దేశం మొత్తం ఆశ్చర్య పోయింది. ఇపుడు పారిశ్రామిక, కార్పోరేట్, స్టాక్ మార్కెట్.. వీరందరి ఆకాంక్షలు నెరవేర్చాల్సిన భారం ఒకవైపు, మరోవైపు సగటు భారతీయుని ఆశల్ని తీర్చాల్సిన అవసరం.. అన్నిటినీ మించి వీటన్నిటినీ సమన్వయ పరుస్తూ దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు తీయించడానికి ఎదురయ్యే సవాళ్ళకు సమాధానం వెతకాల్సిన ముఖ్య బాధ్యత. ఇన్నిటి నడుమ సీతారామన్ బడ్జెట్ ఎన్ని రంగుల్ని మోసుకోస్తుందో.. మరిన్ని కొత్త అంశాల్ని ప్రతిపాదిస్తోందో అన్న ఆసక్తితో యావత్ భారతావనీ ఎదురుచూస్తోంది.

సవాళ్లే ఎక్కువగా ఉన్న దేశ ఆర్ధిక వ్యవస్థ మనది. వినియోగ సూచీ ఇటీవలి కాలంలో పడిపోతూ వస్తోంది. వాహనాల అమ్మకాలు, వినియోగ వస్తువల అమ్మకాలు తగ్గిపోయాయి. దీనికి కారణం ప్రజల ఆదాయం మెరుగ్గా లేకపోవడమే. ఇక కరెంటు ఖాతా లోటు, ఎన్నారై పొడుపు మొత్తాలు గణనీయంగా తగ్గిపోవడం పెద్ద సమస్యగానే ఉంది. అలాగే వ్యవసాయ రంగ వాటా జీడీపీ లో 13.14 శాతానికి పడిపోవడం ఆందోళన కల్గించే అంశం. ఒకప్పుడు 50 శాతం వాటా ఈ రంగానిది. 2000 సంవత్సరంలో 25 శాతానికి పడిపోయింది. ఇపుడు మరింతగా దిగజారింది. వ్యవసాయ రంగాన్ని వృద్ధి చేయాలని ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది.

అదేవిధంగా నిరుద్యోగం అతి పెద్ద సవాలుగా నిలిచింది. సంఘటిత రంగాల్లో నిరుద్యోగం దాదాపు 6.1 శాతం ఉంది.

మరోపక్క బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు నిరర్ధక ఆస్తులు, నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్యాంకులకు 8.6 లక్షల కోట్ల మోడ్ని బకాయిలు ఉన్నాయి. ఇక ఆహార సబ్సిడీ పెరిగిపోవడం వంటి కష్టాలూ చాలానే ఉన్నాయి.

ఇపుడు వీటన్నిటినీ ఎలా ఎదుర్కోబోతున్నారన్న విషయం నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలియాలి. ఇది పెద్ద సవాలే. ఈ సవాలుని సీతారామన్ ఏవిధంగా గెలవబోతున్నారో.. అశావహులకు ఏ రకమైన తాయిలాలు ఇవ్వబోతున్నారో.. రాష్ట్రాల అవసరాలపై ఎలా స్పందించబోతున్నారో నిర్మలా సీతారామన్ మరికొద్ది సేపట్లో తేల్చనున్నారు. బీ రెడీ!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories